వరద సాయం కోసం బాధితులు మీ సేవ సెంటర్లకు రావద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వరదసాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నారని పేర్కొన్నారు. బాధితుల వివరాలు, ఆధార్ నెంబర్ ధ్రువీకరణ జరుగుతోందన్నారు. వెరిఫికేషన్ తర్వాత అర్హుల ఖాతాల్లోనే నేరుగా వరద సాయం డబ్బులు జమవుతాయని చెప్పారు.

ఈ నెల 7వ తేదీ నుంచి వరద సహాయం మళ్లీ ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 8 గంటల బాధితులు మీ సేవ కేంద్రాలకు తరలివచ్చారు. ప్రభుత్వం ఇప్పటికే రూ.6.64 లక్షల వరద బాధిత కుటుంబాలకు రూ.664 కోట్లు అందజేసింది. మరో 3.31 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం వరదసాయాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే.