22.6 C
Hyderabad
Saturday, January 16, 2021

వరుసగా ఏడోరోజు పెరిగిన.. పెట్రోల్ ధరలు

గత కొన్నిరోజులుగా దేశంలో వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ దెబ్బకు పెట్రో ధరలు రెండేండ్ల గరిష్ట ధరకు చేరాయి. ఆదివారం నాడు లీటర్‌ పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 29 చొప్పున పెంచిన ఆయిల్ కంపెనీలు, తాజాగా సోమవారం నాడు పెట్రోల్‌పై 30-33, డీజిల్‌పై 25-31 పైసలు పెంచాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.83.41 నుంచి రూ.83.71కి చేరింది. డీజిల్‌ ధర రూ.73.62 నుంచి 73.87కి పెరి‌గింది. 2018 సెప్టెంబర్‌ తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే తొలి‌సారి. గత నెల 20వ తేదీ నుంచి ఇప్పటి వరకు చమురు ధరలు 14 సార్లు పెరిగాయి. గత 18 రోజులుగా లెక్కవేస్తే.. పెట్రోల్‌ లీటరుకు రూ.2.65, డీజిల్‌ రూ.3.40కు పెరి‌గింది. 

ముంబైలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.90.34, డీజిల్‌ ధర రూ.80.51, కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.85.19, డీజిల్‌ ధర రూ.77.44, చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.86.51, డీజిల్‌ ధర రూ.79.21, బెంగళూరులో పెట్రోల్‌ రూ.86.51, డీజిల్‌ రూ.78.31,హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.87.06, డీజిల్‌ ధర రూ.80.32గా ఉంది.

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...