రెండు వారాల క్రితమే కరోనా వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. భారత్ బయోటెక్ ట్రయల్ షాట్ కూడా వేసింది. వ్యాక్సిన్ ట్రయల్ లో భాగంగా హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ వ్యాక్సిన్ వేసుకున్నారు. ఆయనతో పాటు.. 25వేల మంది స్వచ్ఛందంగా ట్రయల్ డోస్ వేసుకున్నారు.
వ్యాక్సిన్ వేసుకున్న వారం తర్వాత ఆయనకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేస్తూ ప్రకటించారు. కరోనా పాజిటివ్ తో అంబాలాలోని సివిల్ దవాఖానలో చేరినట్లు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. తనతో పాటు సన్నిహితంగా తిరిగిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.