24.2 C
Hyderabad
Friday, January 22, 2021

సిద్దిపేట మెడికల్ కాలేజీ ప్రారంభం.. 960 పడకల ఆస్పత్రికి శంఖుస్థాపన

సిద్దిపేట పర్యటనలో భాగంగా ఎన్సాన్‌పల్లి గ్రామ శివారులో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. 960 పడకల జనరల్‌ హాస్పిటల్‌ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ.225 కోట్ల ఖర్చుతో జనరల్‌ హాస్పిటల్‌ను నిర్మించనున్నారు. అనంతరం సిద్దిపేటలోని కోమటి చెరువు వద్దకు చేరుకొని.. మినీ ట్యాంక్‌బండ్‌ సుందరీకరణ పనులను, నెక్లెస్‌ రోడ్డును పరిశీలించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.135 కోట్ల వ్యయంతో మూడంతస్థుల మెడికల్‌ కాలేజీని నిర్మించారు. ఈ భవన సముదాయ నిర్మాణానికి  సీఎం కేసీఆర్‌ 2017, అక్టోబర్‌ నెలలో శంకుస్థాపన చేశారు. ఈ మెడికల్‌ కళాశాలలో మొత్తం 8 డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌లో లైబ్రెరీ, అటానమీ డిపార్ట్‌మెంట్‌తో పాటు అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్‌తో పాటు రెండు తరగతి గదులు ఉన్నాయి.  మొదటి అంతస్తులో రీడింగ్‌ రూమ్‌, రెండు తరగతి గదులు, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీలను ఏర్పాటు చేశారు. రెండో అంతస్తులో కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగం, రెండు పరీక్ష గదులు, ఫార్మా కళాశాల, ఫైతాలజీ డిపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేశారు. మూడో అంతస్తులో మైక్రో బయాలజీ డిపార్ట్‌మెంట్‌తో పాటు ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగం, క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. 

మెడికల్‌ కళాశాల ప్రాంగణంలోనే విద్యార్థులకు హాస్టల్‌ వసతి కోసం ‘జీ’ప్లస్‌-5 విధానంలో బాలురు, బాలికలకు వేర్వేరుగా భవనాలను నిర్మించారు. 12,024 చదరపు అడుగుల్లో కిచెన్‌ బిల్డింగ్‌ను నిర్మించారు. బాలురు, బాలికలకు హాస్టల్‌ వసతితో పాటు కళాశాలలోని టీచింగ్‌ స్టాఫ్‌ కోసం 26 క్వార్టర్లు, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ కోసం 36 క్వార్టర్లను ‘జీ’ప్లస్‌-5 విధానంలో నిర్మించారు. ప్రిన్సిపాల్‌, హెచ్‌వోడీల కోసం ప్రత్యేక బ్లాక్‌లను నిర్మించారు. కళాశాల ఏర్పాటుతో సిద్దిపేట జనరల్‌ దవాఖానలో మెడికల్‌ కళాశాల తరగతులు ప్రారంభమయ్యాయి. 2018-19 మొదటి బ్యాచ్‌లో 150 మంది విద్యార్థులు, 2019-20 రెండో బ్యాచ్‌లో 175 మంది విద్యార్థులు మెడిసిన్ విద్యను అభ్యసిస్తున్నారు. 2020-21 మూడో బ్యాచ్‌కు అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. ఇదే సముదాయంలో రూ.225 కోట్లతో 960 పడకల జనరల్‌ దవాఖాన భవనాన్ని జీ+7 పద్ధతిలో నిర్మించనున్నారు. దీనికి సీఎం కేసీఆర్‌ భూమిపూజ చేశారు.

- Advertisement -

Latest news

Related news

కరోనాను కంట్రోల్ చేయలేక ప్రధాని రిజైన్.. ఎక్కడంటే..

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఎంత గజగజలాడించినా అన్ని దేశాలు ఎంతోకొంత ప్రయత్నం చేస్తూ.. కొంతవరకైనా కట్టడి చేస్తున్నాయి. అయితే ఒక దేశంలో మాత్రం కరోనా వైరస్‌ను నియంత్రించలేక ఏకంగా ప్రధానమంత్రే...

ప్రభాస్ పెళ్లిపై రెబల్ స్టార్ కామెంట్

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ ఒకరు. పాన్‌ ఇండియా స్టార్‌గా అదరగొడుతున్న ప్రభాస్.. పెళ్లి గురించి ఎప్పుడూ టాపిక్ వచ్చినా అది హాట్ టాపిక్ గానే ఉంటుంది. బాహుబలి...

మహేశ్ కొత్త ఫొటోలు చూశారా?

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. సర్కారు వారి పాట షూటింగ్ కోసం జిమ్ముల్లో కసరత్తులు...

స్ట్రీట్‌కు సుశాంత్ పేరు.. ఎక్కడంటే..

దివంగత బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఓ అరుదైన గౌరవం లభించింది. సుశాంత్ పేరుని ఢిల్లీ ప్రజలు మర్చిపోకుండా ఢిల్లీ మున్సిపల్ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు.