21.2 C
Hyderabad
Monday, January 18, 2021

సిద్దిపేట సభ హైలైట్స్

సిద్దిపేట పేరులోనే ఏదో బలం ఉందని.. ఇది మామూలు పేట కాదు. తెలంగాణ సిద్దింప చేసిన గడ్డ అని అన్నారు సిద్దిపేట సభలో సీఎం కేసీఆర్. సిద్దిపేట లేకుంటే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట ఎంత మద్దతు ఇచ్చిందో ఆయన గుర్తు చేసుకున్నారు. సిద్దిపేటను వదిలి వెళ్తూ హరీశ్ రావుకు అప్పగించానని.. ఆయన సిద్దిపేటను అద్భుతంగా తీర్చిదిద్దాడని ప్రశంసించారు. నాకు ఎన్నో కలలు ఉండేవని.. భగవంతుని దయ వల్ల చాలావరకు అవి నెరవేరాయని సీఎం అన్నారు.

ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేయాలన కోరానని.. పలు కారణాల వల్ల అప్పట్లో సిద్దిపేట జిల్లా ఏర్పాటు కాలేదని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సిద్దిపేట జిల్లా కల నిజమైందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ వస్తే విద్యుత్ సమస్య వస్తుందని.. చాలామంది అపోహలు ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. రాష్ట్రంలో ప్రస్తుతం కరెంటు సమస్య లేదని.. ఈ రోజు ఇతరులకు ఇచ్చే స్థాయికి ఎదిగాం అన్నారు. మంచినీటి గోస తీర్చుకున్నాం.. సిద్దిపేట కేంద్రంగా మిషన్ భగీరథ విజయవంతంగా పూర్తి చేసుకున్నామని సీఎం తెలిపారు.

 రంగనాయక స్వామి దయ, కాళేశ్వర స్వామి దయ వల్ల సాగునీటి గోస తీరిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. భవిష్యత్తులో రంగనాయకసాగర్ గొప్ప పర్యాటక ప్రాంతం కాబోతున్నదని.. 68 ఎకరాల జాగాలో అంతర్జాతీయ స్థాయి పర్యటక కేంద్రాన్ని తీర్చి దిద్దుతామన్నారు. ఇందుకు గానూ రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. మల్లన్నసాగర్ నుంచి ఇరుకోడ్ లిఫ్ట్ ఇరిగేషన్ కు రూ. 80 కోట్లు, రాజీవ్ రహదారి టూ రాజీవ్ రహదారి 75 కి.మీ. రింగ్ రోడ్డుకు రూ. 160 కోట్లు, సిద్దిపేట – ఇల్లంతకుంట వరకు 25 కి.మీ. నాలుగు వరుసల రహదారి, పట్టణానికి మరో వెయ్యి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.

దేశంలోనే రెండు పడకల ఇండ్లు రోల్ మోడల్ గా ఉన్నాయని.. వాటి నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని, పేదోడికి సొంతిల్లు అందించాలన్న తన కల నెరవేరిందని తెలిపారు. సిద్దిపేటకు 3వ టౌన్ పోలీస్ స్టేషన్, కేసీఆర్ నగర్ లో బస్తీ దవాఖాన మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. కోమటి చెరువు కోటి అందాల చెరువుగా అద్భుతంగా మారిందని.. ఇందుకు గానూ మరో రూ.25 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. సిద్దిపేట పట్టణానికి 50 కోట్లతో 2000 మంది సామర్థ్యం గల ఆడిటోరియం నిర్మిస్తామన్నారు. రూ. 25 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం చేపడుతామన్నారు.

హైదరాబాద్ నగరాన్ని తలపించేలా సిద్దిపేట పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. రాష్ట్రానికి మరో ఎయిర్ పోర్ట్ అవసరమైతే సిద్దిపేటలోనే ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...