19.3 C
Hyderabad
Thursday, January 21, 2021

సిద్ధిపేటలో.. 960 పడకల దవాఖాన

సిద్దిపేటలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా రూ.225 కోట్లతో నిర్మించనున్న 960 పడకల దవాఖానకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్‌ 10న సీఎం కేసీఆర్‌ సిద్దిపేటలో పర్యటించనున్నారు. జిల్లాకు సీఎం రాక నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మంత్రి తన్నీరు హరీశ్‌రావు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో పదివేల మందితో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సిద్దిపేటలో పర్యటించనున్న సీఎం కేసీఆర్‌ పట్టణ శివారులో ఏర్పాటు చేయనున్న ఐటీ టవర్‌ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. నాగులబండ వద్ద రూ.45 కోట్లతో జీప్లస్‌ 5 అంతస్తులతో ఈ ఐటీ టవర్లు రూపుదిద్దుకోనున్నాయి. పొన్నాలలో నిర్మించిన తెలంగాణ భవన్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత రూ.135 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను ప్రారంభిస్తారు. రూ.225 కోట్లతో నిర్మించనున్న 960 పడకల దవాఖానకు శంకుస్థాపన చేసి.. కోమటి చెరువు సుందరీకరణ పనులను పరిశీలిస్తారు.

సిద్దిపేట పట్టణంలో రూ.278 కోట్లతో చింతల్‌ చెరువు వద్ద నిర్మించిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీని కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. అనంతరం చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ శివారులోని రంగనాయకసాగర్‌ జలాశయం మధ్యలో రూ.8 కోట్లతో నిర్మించిన అతిథి గృహాన్ని సీఎం ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలోని బహిరంగసభలో పాల్గొంటారు.

- Advertisement -

Latest news

Related news

కొత్త సాగు చట్టాలు.. 18 నెలలపాటు అమలు వాయిదా

కొత్త సాగు చట్టాలకు సంబంధించి రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. రైతు సంఘాలు లేవనెత్తిన మూడు కీలక చట్టాల అమలును 18 నెలలపాటు నిలిపివేయనున్నట్లు చెప్పింది....

బైడెన్ పట్టాభిషేకానికి బరాక్, క్లింటన్, బుష్

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పట్టాబిషేక కార్యక్రమానికి ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా- మిచెల్ ఒబామా, బిల్ క్లింటన్- హిల్లరీ క్లింటన్‌,...

బైడెన్ తొలి సంతకం వీటిపైనే..

అమెరికా ప్రెసిడెంట్ గా బైడెన్ మరికొన్ని గంటల్లో బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు చేపట్టిన మరు క్షణమే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని వివాదస్పద అంశాలను రద్దు చేస్తూ తొలి సంతకం...

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ఆవిష్కరణ

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ని మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మినిస్టర్ ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇంటింటికి...