బస్సులో సీటు కోసం కిటికీలో నుంచి వేసిన ఓ ప్రయాణికురాలి బ్యాగు అపహరణకు గురైంది. అమ్మిరెడ్డిపల్లికి చెందిన హైమావతి హైదరాబాద్ వెళ్లేందుకు తండ్రి, ఇద్దరు పిల్లలతో కలిసి.. నారాయణపేట బస్టాండుకు చేరుకుంది. బస్సు రాగానే సీటు కోసం చేతిలో ఉన్న బ్యాగును బస్సులో వేసింది. బస్సు ఎక్కి చూస్తే.. సీటు కోసం వేసిన బ్యాగు కనిపించలేదు. బ్యాగులో ఆరు తులాల బంగారు ఆభరణాలు, రూ.6వేల నగదు ఉంది.

వెంటనే అప్రమత్తమైన హైమావతి. బస్సు ఆపమని కేకలు వేసిందది. బస్సును, బస్సులోని ప్రయాణికులను ఆపేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేసినా ఆచూకీ లభించలేదు. బ్యాగులో రూ.3 లక్షల విలువ చేసే 6 తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.6 వేల నగదు ఉన్నట్టు బాధితురాలు హైమావతి, ఆమె తండ్రి కృష్ణారెడ్డి తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు నారాయణపేట పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.