కరోనా కారణంగా విద్యారంగంపై తీవ్ర ప్రభావం పడింది. కాలేజీలు, స్కూళ్లు మూతపడ్డాయి. దీంతో ఇంటర్మీడియట్ పరీక్షలను 70 శాతం సిలబస్‌తో నిర్వహించి మిగతా 30 శాతం సిలబస్‌ను అసైన్మెంట్, ప్రాజెక్టుల రూపంలో కండక్ట్ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. తాజాగా తెలంగాణ ఎంసెట్ సిలబస్ కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విద్యార్థులపై భారం పడకుండా ఎంసెట్‌ను కూడా 70శాతం ఇంటర్ సిలబస్‌తో నిర్వహించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇంటర్మీడియట్ కాపీ తమకు అందిన తర్వాత ప్రభుత్వం అనుమతి తీసుకుని ఎంసెట్ సిలబస్‌ను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇంటర్ టైమ్ టేబుల్ విడుదలైన తర్వాత ఎంసెట్ ఎంట్రన్స్ షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు.