29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

నెగెటివ్ వచ్చినా నష్టం జరుగుతుంది

టెస్టుల్లో కరోనా నెగెటివ్ వచ్చినా లోపల అది చేయాల్సిన నష్టం చేస్తూనే ఉందని.. ఇటీవల కొన్ని కేసుల్లో తేలింది.
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసే 49 సంవత్సరాల డాక్టర్ కు కరోనా సోకింది. లక్షణాలు పోయిన తర్వాత ఐదు రోజుల తర్వాత టెస్టు చేయించుకుంటే నెగెటివ్‌ వచ్చింది. కానీ వారం తర్వాత ఒంట్లో బాగోపోవడంతో సీటీ స్కాన్‌ చేయించుకుంటే ఊపిరితిత్తుల్లో కొంతభాగం ఇన్ఫెక్ట్‌ అయినట్టు తేలింది. దాంతో ఆయన వెంటనే హాస్పిటల్లో అడ్మిట్‌ అయ్యారు.
మన రాష్ట్రంలో ఇలాంటి కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు ప్రైవేటు డాక్టర్స్ చెప్తున్నారు. కరోనా టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చి.. ఆ తర్వాత సీటీ స్కానింగ్స్‌లో ఊపిరితిత్తులు బాగా దెబ్బతింటున్నాయని వాళ్లు అంటున్నారు.
నెగెటివ్‌ వస్తే..ఇలా చేయాలి
కరోనా నెగెటివ్‌ వచ్చినా ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులపై ఆధారపడకుండా మరోసారి ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించుకోవాలి.
ఆర్టీపీసీఆర్‌ టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చి అనారోగ్యంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఇన్ఫెక్షన్‌ లక్షణాలు లేకుండా.. టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే పల్స్‌ ఆక్సీ మీటర్‌తో ఆక్సిజన్‌ లెవల్‌ను పరీక్షించుకోవాలి.95 శాతం కంటే తక్కువగా ఉంటే.. ఓసారి డాక్టర్ ను కలవాలి.

- Advertisement -

Latest news

Related news