22.6 C
Hyderabad
Saturday, January 16, 2021

తెలంగాణ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా హిమా కోహ్లీ

తెలంగాణ రాష్ర్ట‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లీ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భ‌వ‌న్‌లో జ‌స్టిస్ హిమా కోహ్లీ చేత‌ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కే చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇంకా శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో పాటు హైకోర్టు న్యాయ‌మూర్తులు హాజ‌ర‌య్యారు. ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మం ముగిసిన అనంత‌రం జ‌స్టిస్ హిమా కోహ్లీకి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుష్ప‌గుచ్ఛం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు.


మొద‌టి మ‌హిళా చీఫ్ జ‌స్టిస్
జస్టిస్‌ హిమ కోహ్లీ తెలంగాణ హైకోర్టుకు మొదటి మహిళా చీఫ్ జ‌స్టిస్‌గా నిలిచారు. 1959 సెప్టెంబర్‌లో ఢిల్లీలో పుట్టిన జస్టిస్‌ హిమ కోహ్లీ 1979లో సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాల నుంచి బీఏ ఆనర్స్‌ హిస్టరీలో పట్టభద్రులయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌ లా సెంటర్‌ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1984లో ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌లో సభ్యురాలిగా చేరారు. 2006 మేలో ఢిల్లీ హైకోర్టులోనే అదనపు జడ్జిగా నియమితులయ్యారు. సుమారు 15 నెలల తరువాత పూర్తిస్థాయి జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు.

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...