27.9 C
Hyderabad
Friday, January 22, 2021

తాను వైసీపీ కార్యకర్తనే.. జనసేన ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు

తాను వైసీపీ కార్యకర్తనేనంటూ.. రాజోలు  జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ నన్ను వైసీపీలో కొనసాగమని చెబుతుంటే.. మీకు అభ్యంతరం ఏంటి? అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నించారు. ఇళ్ల పట్టాల పంపిణీలో వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు రాపాక వ్యవహారాన్ని లైట్‌గా తీసుకున్న అధిష్టానం.. తాజా వ్యాఖ్యలతో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది చర్చగా మారింది. జనసేన తరపున గెలిచినప్పటి నుంచి ఎప్పుడూ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్న రాపాక.. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశాలను కూడా ఆయన పెడచెవిన పెడుతూ వచ్చారు. అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్‌ సర్కార్‌ తెచ్చిన పథకాలు, వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను కూడా సమర్థిస్తూ వస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

వైరల్ అవుతున్న​ ఎలన్‌ మస్క్‌ చాలెంజ్‌

పెరిగిన జనాభా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల లాభమేమోగానీ నష్టమే ఎక్కువ ఉందని అర్థమవుతుంది. పచ్చగా ఉండాల్సిన భూమిపై జీవం ఎండిపోతుంది. వాతావరణంలో ఎన్నెన్నో మార్పులొస్తున్నాయి. ప్రస్తుతం మన ఎన్విరాన్‌మెంట్‌కు ఉన్న...

కరోనాను కంట్రోల్ చేయలేక ప్రధాని రిజైన్.. ఎక్కడంటే..

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఎంత గజగజలాడించినా అన్ని దేశాలు ఎంతోకొంత ప్రయత్నం చేస్తూ.. కొంతవరకైనా కట్టడి చేస్తున్నాయి. అయితే ఒక దేశంలో మాత్రం కరోనా వైరస్‌ను నియంత్రించలేక ఏకంగా ప్రధానమంత్రే...

ప్రభాస్ పెళ్లిపై రెబల్ స్టార్ కామెంట్

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ ఒకరు. పాన్‌ ఇండియా స్టార్‌గా అదరగొడుతున్న ప్రభాస్.. పెళ్లి గురించి ఎప్పుడూ టాపిక్ వచ్చినా అది హాట్ టాపిక్ గానే ఉంటుంది. బాహుబలి...

మహేశ్ కొత్త ఫొటోలు చూశారా?

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. సర్కారు వారి పాట షూటింగ్ కోసం జిమ్ముల్లో కసరత్తులు...