బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను ఘట్కేసర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ లో బీజేపీ కార్యాలయంపై జరిగిన దాడిని పరిశీలించడానికి బయలుదేరిన ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఏసీపీ భుజంగరావు ఘట్కేసర్ వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
నిన్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి మీద బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి, పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలకు మద్దతు తెలిపేందుకు వరంగల్ వెళ్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఘట్కేసర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
