29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

తెలంగాణ బ్రాండ్ ఆలుగడ్డ ఇది

వస్తువులకే కాదు పంటలకూ కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. షిమ్లా యాపిల్, కేరళ కొబ్బరి.. ఇలా అన్నమాట. అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా ఓ పంట బ్రాండ్ గా మనముందుకి రానుంది. అదేంటంటే.


మన రాష్ట్రంలో రీసెంట్ గా.. ఆగ్రా విత్తనాలతో పండించిన అనంతగిరి ఆలుగడ్డలు ప్రత్యేక ప్యాకింగ్, ప్రత్యేక బ్రాండింగ్ తో ఈ నెల 29న మార్కెట్‌లోకి రానున్నాయి. అనంతగిరి ఆలుగడ్డను తెలంగాణ బ్రాండ్‌గా త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఆధ్వర్యంలో నడుస్తున్న వికారాబాద్‌ రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్‌పీవో) అనంతగిరి పొటాటో పేరుతో తెలంగాణ ఆలుగడ్డ బ్రాండ్‌ను లాంచ్‌ చేయనున్నారు.
దీనికోసం.. ఆగ్రా నుంచి సెర్ప్‌ అధికారులు విత్తనాలు తెప్పించి, వికారాబాద్‌ ఎఫ్‌పీవో పరిధిలో ఎంపికచేసిన 75 మంది రైతులకు సగం ధరకే సరఫరా చేశారు. వారు పండించిన ఆ లుగడ్డనే ఇప్పుడు బ్రాండ్ గా తయారయ్యాయి.

வேகமா எடை குறையணுமா?... அப்போ காலிஃபிளவர் டயட் ஃபாலோ பண்ணுங்க... -  cauliflower diet for quick weight loss in tamil | Samayam Tamil


ప్రత్యేకతలివీ..
ఈ ఆలుగడ్డలు కిలో ప్యాకెట్లలో లభించనున్నాయి. వీటిపై ‘ఫ్రెష్‌లీ హార్వెస్టెడ్‌ లోకలైజ్‌ ప్రొడ్యూస్డ్‌’ అనే ట్యాగ్‌ ఉంటుంది.
అలాగే ప్రతి ప్యాకెట్‌పై క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే.. ఆలుగడ్డ ఎక్కడ పండింది అనే వివరాలు తెలుసుకోవచ్చు.

- Advertisement -

Latest news

Related news