29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

టీకా లెక్కలివీ..

దేశంలో టీకా ప్రోగ్రామ్ జోరుమీదుంది. జనాల్లో కొద్దికొద్దిగా వ్యాక్సిన్ పై భయం తగ్గుతుంది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో సోమవారం నుంచి టీకా వేసే కేంద్రాలతోపాటు టీకాల సంఖ్యను కూడా పెంచుతున్నారు. శనివారం టీకా తీసుకోని వారు ఆదివారం కూడా వేయించుకోకపోతే వారికి మరో అవకాశం ఇవ్వబోమని కేంద్రం హెచ్చరించింది. దీంతో శనివారం టీకా వేయించుకోని వారిలో చాలామంది ఆదివారం తీసుకున్నారు. మొత్తంగా రెండు రోజులకు కలిపి దేశంలో 2,24,301 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నట్టు తెలుస్తోంది.


సైడ్ ఎఫెక్ట్స్ తక్కువే..
దేశం మొత్తంమీద 447 మందికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఇబ్బంది పెట్టాయి. అందులో ముగ్గురికి హాస్పిటల్ లో చికిత్స చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వారిలో ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉంది. దీన్ని బట్టి చూస్తే టీకా సేఫ్ అనే భావనకు బలం పెరుగుతోంది.


మనదే టాప్‌
ఒక్కో కేంద్రంలో రోజుకు 100 మందికి టీకా ఇవ్వాలన్నది కేంద్రం సూచించింది. కానీ, భయం వల్లనో.. తర్వాత చూద్దామనే ధోరణితోనో.. కొవిన్‌ యాప్‌లో లోపాల వల్లనో.. కారణమేదైనా.. ఎక్కడా 100 శాతం లబ్ధిదారులు టీకా వేయించుకోవడానికి రాలేదు. కేంద్రం లెక్క ప్రకారం.. తొలిరోజు 3,35,200 మందికి టీకా ఇవ్వాలి. కానీ, 2,07,229 మంది అంటే 61.82 శాతం మంది మాత్రమే టీకా తీసుకున్నారు. ఏపీలో 31,570 మందికిగాను 19,025 మంది (60.26%) మాత్రమే టీకా తీసుకున్నారు. ఇకపోతే సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా తెలంగాణలో ఒక్కో కేంద్రంలో తొలి రోజు 30 మందికే వేశారు. మొత్తం 140 కేంద్రాల్లో 4,200 మందికి గానూ 3,962 మంది టీకా వేయించుకున్నారు. అంటే 94.3 శాతం. ఇది దేశంలోనే అత్యధిక శాతం. ఆంధ్రప్రదేశ్‌లో వారానికి ఆరు రోజులపాటు.. తెలంగాణ సహా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వారానికి నాలుగు రోజులపాటు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంది.

- Advertisement -

Latest news

Related news