25.4 C
Hyderabad
Sunday, January 17, 2021

రూ.200 ఖర్చు పెడితే.. 60 లక్షలు వెతుక్కుంటూ వచ్చాయ్

అదృష్ట దేవత ఎప్పుడు.. ఎవరి తలుపు తడుతుందో ఎవ్వరూ ఊహించలేరు. మ‌ధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక రైతుకు పట్టిన అదృష్టం చూసి.. చుట్టుపక్క వారంతా ఆశ్చర్యపోతున్నరు. 45 ఏండ్ల లఖన్ యాదవ్ కూరగాయలు పండిచడం కోసం.. రూ.200 పెట్టి భూమిని లీజుకు తీసుకున్నడు. భూమిని చ‌దును చేస్తుండగా.. కొన్ని రంగు రాళ్లు బ‌య‌ట‌ప‌డ్డయి. వాటిని భ‌ద్రంగా దాచి.. తెలిసిన వారి ద్వారా రంగురాళ్ల వ్యాపారికి చూపించిండు. ఆ రాయిని బాగా పరిశీలించిన వ్యాపారి అది రాయి కాదు 14.98 క్యారెట్ల వ‌జ్రం అని చెప్పిండు. అంతే.. అప్పటి వరకు తినడానికి తిండి కూడా సక్కగ లేని ఆ రైతు ఒక్కసారిగా లక్షాధికారి అయిపోయిండు. భూమిల దొరికిన వజ్రాన్ని అమ్మితే.. ల‌ఖ‌న్‌ యాద‌వ్‌కు రూ.60.6 లక్షలు వచ్చినయి. కేవలం 200 రూపాయలతో.. లక్షాధికారి కావడం చెప్పలేని ఆనందాన్నిస్తున్నదని లఖన్ యాదవ్ మురుస్తూ చెప్తున్నడు. వ‌జ్రం అమ్మితే వ‌చ్చిన సొమ్ముతో తన నలుగురు పిల్లలను బాగా చదివిస్త అంటున్నాడు.

పన్నా నేషనల్ పార్క్ కోసం.. పలు గ్రామాలను అక్కడి నుంచి తరలించగా.. దురదృష్టవశాత్తు లఖన్ యాదవ్ కూడా ఇల్లు కోల్పోయి రోడ్డున పడ్డడు. అయితే.. అదృష్టం మాత్రం వజ్రం రూపంలో వెతుక్కుంటూ మరీ వచ్చి ఆయన దరిద్రాన్ని పోగొట్టింది. ఇల్లు కోల్పోయినందుకు వచ్చిన పరిహారంతో రెండు హెక్టార్ల భూమి, రెండు బర్రెలను కొన్నడు. వజ్రం అమ్మగా వ‌చ్చిన పైసలతో ఇంటి అవసరాల కోసం బైక్‌ కొంటానంటున్నడు అదృష్టవంతుడు లఖన్ యాదవ్.

- Advertisement -

Latest news

Related news

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...

మారిన కరోనా కాలర్ ట్యూన్

ఎవరికైనా కాల్ చేయగానే దగ్గు సౌండ్ వినిపించి కరోనా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే.. అంటూ ఒక కాలర్ వాయిస్ వినిపించేది. అయితే ఇప్పుడా ట్యూన్ మారిపోయింది. ఇప్పుడేం...