ప్రధాని నరేంద్రమోదీ కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న ఏడు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులతో బుధవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగనున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రులతోపాటు ఆ ఏడు రాష్ట్రాల ఆరోగ్యమంత్రులు కూడా పాల్గొననున్నారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తీరు, ఆ వైరస్ను అరికట్టడానికి చేపడుతున్న చర్యలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.