28.4 C
Hyderabad
Thursday, October 29, 2020

రైతును కాపాడటం మా కర్తవ్యం

రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యులు పార్లమెంట్‌ అవరణలో నిరసన కొనసాగించారు. పార్లమెంట్‌ అవరణలో గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు విపక్ష ఎంపీలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీఆర్‌ఎస్‌కు చెందిన రాజ్యసభ సభ్యులు  సంతోష్‌కుమార్‌, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీలు ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలుచేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, రైతులను కాపాడాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం సాయంత్రం రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ బృందంలో టీఆర్ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కేకే తదితరులున్నారు. మోడీ సర్కార్‌ కార్పొరేట్‌ సెక్టార్‌ కు కొమ్ముకాస్తూ రైతులను అణగదొక్కుతుందని టీఆర్ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కేకే ఆరోపించారు. సభలో బిల్లును తప్పుడు పద్దతిలో పాస్‌ చేశారన్న కేకే.. ప్రశ్నించిన పాపానికి సభ్యులను సస్పెండ్‌ చేశారన్నారు. బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

టీఆర్‌ఎస్‌ పార్టీ లోక్‌సభ సభ్యులు సమావేశాల్ని బుధవారం కూడా బాయ్‌కాట్‌ చేశారు. గాంధీ విగ్రహం వద్ద పార్టీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఎంపీలు బీబీ పాటిల్‌, పసునూరి దయాకర్‌, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, వెంకటేశ్‌ నేతకాని పాల్గొన్నారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం షెడ్యూల్‌కంటే ముందుగానే ముగించింది. కోట్లాదిమంది కార్మికులు, కర్షకుల జీవితాలను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన బిల్లులను ప్రతిపక్షాలు లేకుండానే, సరైన చర్చలు జరుపకుండానే ఆమోదింపజేసుకున్న మోదీ సర్కారు, వెంటనే పార్లమెంటును నిరవధికంగా వాయిదా వేయించింది. ఈ నెల 14న కట్టుదిట్టమైన కరోనా జాగ్రత్తల మధ్య ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు అక్టోబర్‌ 1 వరకు కొనసాగాల్సి ఉన్నది. కానీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వ్యవసాయ, కార్మిక చట్ట సవరణ బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందగానే సమావేశాలను ముగించింది. పది రోజుల్లో మొత్తం 25 బిల్లులకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ చర్యపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాజ్యాంగ నియమాలను తుంగలో తొక్కి బిల్లులను ఆమోదించారని ఆరోపించాయి.

- Advertisement -

Latest news

Related news

ఎమ్మెల్సీగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన క‌ల్వ‌కుంట్ల‌ క‌విత

నిజా‌మా‌బాద్‌ స్థానిక సంస్థల ఎమ్మె‌ల్సీగా కల్వ‌కుంట్ల కవిత గురు‌వారం మ‌ధ్యాహ్నం ప్రమాణం స్వీకారం చేశారు. శాస‌న‌స‌మం‌డలి దర్బార్ హాల్‌లో మధ్యాహ్నం 12.45 గంట‌లకు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేం‌ద‌ర్‌‌రెడ్డి.. ఆమె...

ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ధరణి పోర్టల్ ను సీఎం కేసీఆర్  ప్రారంభించారు. రాష్ట్ర ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ధరణి పోర్టల్ నేటి నుంచి అందుబాటులోకి రాబోతున్నది. రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే...

స‌మాజ్‌వాదీ పార్టీతో ఇక ఎలాంటి పొత్తులు ఉండ‌వు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో ఎస్పీ, బీఎస్పీల మిత్రుత్వానికి ఫుల్‌ స్టాప్ ప‌డింది. స‌మాజ్‌వాదీ పార్టీతో ఇక ఎలాంటి పొత్తులు ఉండ‌వ‌ని బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి ప్ర‌క‌టించారు. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో...

చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తోన్న భారీ వర్షాలు

భారీ వర్షాలు చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌ లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా...