21.2 C
Hyderabad
Monday, January 18, 2021

రైతుల ఉద్యమానికి టీఆర్ఎస్ అండగా ఉంటుంది : మంత్రి కేటీఆర్

కేంద్రం అమలుచేయాలని చూస్తున్న వ‌్యవ‌సాయ చ‌ట్టాల‌కు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పిలుపు మేర‌కు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున భార‌త్ బంద్‌లో పాల్గొంటున్నాయి. షాద్‌న‌గ‌ర్ వ‌ద్ద బూర్గుల టోల్‌గేట్ వ‌ద్ద టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ భారత్ బంద్ లో పాల్గొన్నారు. ఆయనతో పాటు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌, రాజ్యస‌భ స‌భ్యులు కేశ‌వ‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు కూడా ఉన్నారు.  రైతులు టెర్ర‌రిస్టులు కాదు అనే ప్లకార్డును ప్రద‌ర్శిస్తూ..కేటీఆర్  రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ఉద్యమాన్ని అణిచివేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు సాగవన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల‌కు మ‌ద్దతుగా ఉంటుంద‌ని కేటీఆర్ స్పష్టం చేశారు. 

అలంపూర్ వ‌ద్ద జాతీయ ర‌హ‌దారిపై మంత్రి నిరంజ‌న్ రెడ్డి,  తూప్రాన్‌ వద్ద మంత్రి హరీశ్‌రావు,  హైదరాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, హన్మకొండ-వరంగల్‌ హైవేపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పెద్దపల్లి జిల్లా ధర్మారం, జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, కామారెడ్డి శివారులోని ఎల్లారెడ్డి పరిధిలోని టెక్రియాల్‌ వద్ద ఎమ్మెల్సీ కవిత నిరసనలో పాల్గొన్నారు. తెరాస శ్రేణులు ఎక్కడిక్కడ రోడ్లపై బైఠాయించి భారత్ బంద్ ను విజయవంతం చేస్తున్నాయి.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...