కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి.. సామాజిక కార్యకర్త అన్నా హజారే మద్దతు తెలిపారు. మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లాలోని రాలేగావ్ సిద్ధి గ్రామంలో అన్నా హజారే ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు.

రైతుల ఆందోళనను సపోర్ట్ చేస్తూ.. ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. రైతులు ఆందోళనలను దేశవ్యాప్తం చేయాలని, ఉధృతమైన పోరాటం చేసి.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నా హజారే తెలిపారు. రైతుల చేస్తున్న పోరాటాన్ని హజారే అభినందించారు. పది రోజుల నుంచి జరుగుతున్న నిరసనల్లో ఎలాంటి హింస చోటుచేసుకోలేదని.. శాంతియుతంగా చేస్తున్న పోరాటానికి అందూ మద్దతుగా నిలవాలన్నారు. స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనలను అమలు చేయాలని అన్నా హజారే డిమాండ్ చేశారు.