19.5 C
Hyderabad
Friday, November 27, 2020

రైతు వేదికకు సర్వం సిద్ధం

రైతు వేదికల ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. ఈ నెల 31న మధ్యాహ్నం పన్నెండున్నరకు జనగామ జిల్లా కొడకండ్లలో సీఎం కేసీఆర్.. రైతు వేదికను ప్రారంభిస్తారు. అనంతరం రైతు వేదిక సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని సీఎం సందర్శిస్తారు. రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు. ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టిన ఉద్దేశాన్ని, రైతు వేదికల ఆవశ్యకతను, వాటి ద్వారా జరిగే కార్యకలాపాలను సీఎం వివరిస్తారు. మంత్రి నిరంజన్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

అసంఘటితంగా ఉన్న రైతులందరినీ ఒకచోట చేర్చేలా సీఎం కేసీఆర్‌ రైతు వేదికల నిర్మాణానికి రూపకల్పన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,462, పట్టణ ప్రాంతాల్లో 139 కలిపి మొత్తం 2,601 రైతు వేదికలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.350 కోట్లు కేటాయించింది. ఒక్కోదానిని 2,046 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.22 లక్షల వ్యయంతో నిర్మాణ చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణాన్ని నవంబర్ నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించింది.

ఇప్పటికే రైతు వేదికల నిర్మాణం 2,500 వరకు పూర్తికాగా.. మరో పదిహేను రోజుల్లో మొత్తం పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ వేదికల ద్వారా రైతులను ఏకంచేసి వారిలో చైతన్యం నింపేలా ప్రభుత్వం కృషి చేస్తున్నది. క్లస్టర్లవారీగా రైతులు కూర్చొని ఏ పంట వేయాలి.. ఎరువులు, విత్తనాలు ఎలా సేకరించుకోవాలి.. పండిన పంటలను ఎక్కడ, ఎంత ధరకు విక్రయించాలి.. మార్కెట్లో ఏ పంటలకు డిమాండ్ ఉన్నది తదితర అంశాలపై రైతులు కూలంకశంగా చర్చించుకునే అవకాశం ఉంటుంది. అన్నదాతలు ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు విశీలమైన గదులను నిర్మించారు. రైతన్నలు, అధికారులు, రైతుబంధు సమితి కోఆర్డినేటర్లు ఇలా అంతా కూర్చొని చర్చించేందుకు వీలుగా 1,498 చదరపు అడుగుల్లో హాలు, అధికారుల కోసం ప్రత్యేకంగా రెండు గదులను నిర్మించారు. ప్రతి రైతు వేదికకు ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్ నెట్ కనెక్షన్ ఇవ్వడం ద్వారా రైతులు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలతో నేరుగా మాట్లాడే అవకాశం కల్పించనున్నారు. వ్యవసాయానికి సంబంధించిన ప్రతి సమాచారం రైతులకు చేరుతుంది. అన్నదాలతకు నూతన వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించే నైపుణ్య కేంద్రాలుగానూ ఇవి ఉపయోగపడనున్నాయి.

సీఎం కేసీఆర్‌ రైతు వేదిక ప్రారంభించనున్న నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కొత్తగా నిర్మించిన రైతు వేదిక, పల్లె ప్రకృతి వనంతో పాటు హెలీ ప్యాడ్‌ ను కూడా మంత్రి  పరిశీలించారు

- Advertisement -

Latest news

Related news

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....

నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప హిందువు. సీఎం కేసీఆర్‌ చేసే యజ్ఞయాగాది క్రతువులు తాను ఎలాంటివారో చెప్పక్కనే చెబుతాయి. కేసీఆర్‌ చేపట్టిన ఏ పనిలోనైనా...