26.7 C
Hyderabad
Saturday, January 23, 2021

రోహ్‌తంగ్‌ లో అటల్‌ టన్నెల్‌ ను ప్రారంభించిన ప్రధాని మోడీ

హిమాచల్‌ ప్రదేశ్‌ లో ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన అటల్‌ టన్నెల్‌ ను ప్రారంభించారు ప్రధాని  మోడీ. రోహ్‌ తంగ్‌ లో నిర్మించిన ఈ సొరంగ మార్గంలో రక్షణమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌, ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ సింగ్‌ తో కలిసి ప్రయాణించారు. రూ.3,500 కోట్ల వ్యయంతో 9.02 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ టన్నెల్‌ ను.. సముద్ర మట్టానికి 10,213 అడుగుల ఎత్తున అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేలా అత్యాధునిక సాంకేతికతతో నిర్మించారు. ఈ టన్నెల్‌ తో మనాలి-లేహ్ మధ్య 475 కిలోమీటర్ల దూరం 46 కిలోమీటర్లకు తగ్గనుంది. ఐదు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఇక జూన్‌ 3, 2000 సంవత్సరంలో నాటి ప్రధాని అటల్‌ బీహారీ వాజ్‌పేయ్‌ ఈ టన్నెల్‌ నిర్మించాలని నిర్ణయించగా.. మే 26, 2002లో దీని నిర్మాణానికి పునాది రాయి పడింది.  అయితే వాతావరణ పరిస్థితులు, ఇతరత్రా కారణాల వల్ల ఇప్పటికి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చింది.

- Advertisement -

Latest news

Related news

మొబైల్‌ యాప్‌లో కేంద్ర బడ్జెట్

ఫిబ్రవరి 1 పార్లమెంట్ లో కేంద్రం బడ్జెట్ ని ప్రవేశ పెడుతుంది. అయితే కరోనా నేపథ్యంలో బడ్జెట్ ప్రతులను ఈసారి ప్రింట్ చేయడం లేదు. పార్లమెంట్‌ సభ్యులతోపాటు సాధారణ ప్రజలు...

స్థానిక యువతకు అవకాశం కల్పిస్తే ఇన్సెంటీవ్‌.. కేటీఆర్

టీఎస్‌ ఐ-పాస్‌ ద్వారా రాష్ట్రంలో పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతి మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఒకవేళ 15 రోజుల్లో అనుమతి ఇయ్యకుంటే ఇచ్చినట్టుగానే...

‘కిసాన్ పరేడ్’కు అనుమతిచ్చిన ఢిల్లీ పోలీసులు

కొత్త సాగు చట్టాలకు నిరసనగా జనవరి  26న ఢిల్లీ వీధుల్లో ట్రాక్టర్లతో ‘కిసాన్ గణతంత్ర పరేడ్’ నిర్వహించేందుకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. కిసాన్ పరేడ్ కు ఢిల్లీ పోలీసులు సూత్రపాయంగా...

నేతాజీ త్యాగాన్ని గుర్తుంచుకోవాలి.. ప్రధాని మోదీ

నేతాజీ సుభాశ్ చంద్రబోస్ స్ఫూర్తితోనే ఈ రోజు భారత్ ముందుకు వెళుతోందని, ఆయన చేసిన కృషి తరతరాల వారూ గుర్తుంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేతాజీ 125 వ...