లడఖ్ ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. నిన్నటి భూప్రకంపనల నుంచి తేరుకోకముందే అర్థరాత్రి మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.7గా నమోదు అయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్రకటించింది. లేహ్ నుంచి 129 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించింది. ఈ భూకంపంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటికి పరుగులు పెట్టారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ,ఆస్తినష్టం సంభవించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.