24.2 C
Hyderabad
Friday, January 22, 2021

విరాళాల కోసం ఆస్తుల తాకట్టు.. మరోసారి దాతృత్వం చాటుకున్న సోనూసూద్

పేదలు, నిస్సహాయులకు సాయం చేస్తూ.. రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూసూద్ మరోసారి తన దానగుణాన్నిచాటుకున్నాడు. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి నిస్సహాయుల్ని ఆదుకుంటూ పేదల పాలిట పెన్నిధిగా మారిన సంగతి తెలిసిందే. ప్రత్యేక బస్సులు, విమానాలు ఏర్పాటు చేసి.. వలస కార్మికుల్ని స్వస్థలాలకు పంపించడం నుంచి పేదపిల్లల విద్య, వైద్య ఖర్చులు కూడా భరిస్తున్నారు. అడిగిన వారికి కాదనకుండా తనవంతు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే.. తన సాయం మరింత మందికి అందించడానికి రూ.10 కోట్ల విరాళం పోగు చేస్తున్నాడు. ఇందుకు గానూ.. ముంబయిలో ఉన్న జుహూలోని తన ఎనిమిది ఆస్తుల్ని తాకట్టు పెట్టాడు. ఇందులో రెండు దుకాణాలు, ఆరు ఫ్లాట్లు ఉన్నాయట. సెప్టెంబరు 15న ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్లపై సంతకం, నవంబరు 24న రిజిస్ట్రేషన్‌ తతంగాలు పూర్తయయ్యాట. ‘ఎదుటివారి కోసం సొంత ఆస్తులను కూడా త్యాగం చేస్తున్న వాళ్లను ఈ కాలంలో నేను ఇంత వరకు చూడలేదు’ అని వెస్ట్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్ అండ్‌ హెడ్ రితేష్‌ మెహతా అన్నారు. కాగా.. ఈ విషయమై సోనూసూద్ ఇంకా స్పందించలేదు. త్వరలోనే సోనూసూద్ ఆస్తుల తాకట్టుపై స్పందించే అవకాశం ఉంది.

- Advertisement -

Latest news

Related news

ప్రభాస్ పెళ్లిపై రెబల్ స్టార్ కామెంట్

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ ఒకరు. పాన్‌ ఇండియా స్టార్‌గా అదరగొడుతున్న ప్రభాస్.. పెళ్లి గురించి ఎప్పుడూ టాపిక్ వచ్చినా అది హాట్ టాపిక్ గానే ఉంటుంది. బాహుబలి...

మహేశ్ కొత్త ఫొటోలు చూశారా?

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. సర్కారు వారి పాట షూటింగ్ కోసం జిమ్ముల్లో కసరత్తులు...

స్ట్రీట్‌కు సుశాంత్ పేరు.. ఎక్కడంటే..

దివంగత బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఓ అరుదైన గౌరవం లభించింది. సుశాంత్ పేరుని ఢిల్లీ ప్రజలు మర్చిపోకుండా ఢిల్లీ మున్సిపల్ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు.

మగవాళ్లను భయపెడుతున్న కోవిడ్ కొత్త సర్వే

వ్యాక్సిన్ వచ్చి.. మెల్లగా కరోనా తగ్గిపోతుందన్న సందర్భంలో.. ఓ కొత్త న్యూస్ భయపెడుతుంది. వైరస్ సోకిన పురుషుల్లో అతికొద్ది మందికి కామన్ గా ఒక లక్షణం కనిపిస్తోంది.