24.3 C
Hyderabad
Wednesday, November 25, 2020

విష వలయంలా విద్యుత్‌ బిల్లు..

ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కోక్కటిగా ప్రైవేటు పరం చేస్తూ వస్తున్నది. నేను చాయ్‌వాలాను.. చాయ్‌ అమ్మానే తప్ప దేశాన్ని అమ్మలేను  అని 2014 ఎన్నికలకు ముందు ప్రచారంలో నరేంద్ర మోదీ చెప్పిన మాటలు ఒట్టి మాటలేనని తేలిపోయింది. గత ఆరున్నరేండ్లలో దేశాన్ని అమ్మలేదేమో కానీ.. అంగట్లో పెట్టి అమ్మినంత పనిచేశారు. మాయ ముచ్చట్లు చెప్తూనే.. ఆదానీలు, అంబానీలకు ఒక్కో ప్రభుత్వ రంగ సంస్థనూ కుదువబెడ్తున్నరు.

మోదీ హయాంలో బీజేపీ సర్కారు ఏ ఒక్క ప్రభుత్వరంగ సంస్థా మనుగడ సాగించలేని పరిస్థితికి చేరుకొన్నది. రైల్వేల నుంచి రైతుల దాకా ప్రజలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలపై ప్రభావితంచేసే అన్ని వ్యవస్థలనూ కార్పొరేట్ల కబంధ హస్తాల్లో పెట్టి ఉచ్చు బిగిస్తున్నరు.  మోదీ అండ్‌కో దేన్ని ముట్టుకున్నా బుగ్గిపాలవ్వాల్సిందే. అన్నవస్ర్తానికి పోతే ఉన్నవస్త్రం పోయినట్టు.. బీజేపీకి ఓటేసి బంపర్‌ మెజార్టీతో గెలిపిస్తే.. మన వేలితో మన కన్నును పొడిచుకున్నట్టయ్యింది. రైళ్లల్లో ఒక్కో రూటును ఒక్కొక్కరికి అమ్ముకుంటున్నరు. ఎయిరిండియా విమానాలను అంగట్ల పెట్టిన్రు. చచ్చినా, బతికినా.. ఆపత్కాలంలో ఆదుకుంటదనుకొనే ఎల్‌ఐసీనీ అమ్మేస్తమంటున్నరు. అంబానీ జియో కోసం.. బంగారంలాటి బీఎస్‌ఎన్‌ఎల్‌ను భ్రష్టు పట్టించినారు. ఇప్పుడు ఆదానీ కోసం కరెంటు వ్యవస్థను నాశనం చేస్తున్నారు…              

ఎల్‌ఐసీని సైతం మోదీ ప్రభుత్వం వదిలి పెట్టలేదు. అందులోనూ పెట్టుబడులను ఉపసంహరించుకొని.. కార్పొరేట్లకు అప్పగించడానికి సంసిద్ధమైంది. ఇప్పుడేమో విద్యుత్‌ చట్ట సవరణ బిల్లుతో రైతాంగానికి పూర్తిస్థాయిలో ఉరి బిగిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే.. బాయికాడ మోటరేసుకొని ప్రశాతంగా నిద్రపోవుడనేది ఉండదు. బిల్లెంత వస్తుందేమోనని క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ.. గుండెదడతో అల్లల్లాడిపోవాల్సిందే. గత మూడేండ్లుగా ఎయిర్‌ ఇండియా, బీపీసీఎల్‌, సీసీఐ, ఎస్‌సీఐల్లో 100 శాతం వాటాను విక్రయించడానికి ప్రయత్నిస్తున్నది. కానీ, వీటిలో వాటాలను కొనడానికి అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపట్లేదు. నిబంధనలు సడలించైనా తామనుకున్నది చేయడానికి మోదీ సర్కారు ప్రయత్నిస్తున్నది…                     

2020-21లో రూ.2.10 లక్షల కోట్లను వాటాలను అమ్మాలని ప్రయత్నించినా.. కరోనా వచ్చి అడ్డుపడ్డది. దీంతో బీమా దిగ్గజం ఎల్‌ఐసీలో వాటా విక్రయించడానికి సిద్ధమైంది. దశలవారీగా 15% వరకు అమ్మే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టేందుకు కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెనుకాడటం లేదంటే కేంద్ర ప్రభుత్వ తీరు ఎట్లున్నదో అర్థం చేసుకోవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు, కరువులతో తరచూ అల్లాడే అన్నదాతలు కాలం కలిసి వచ్చినపుడు పండిన పంటను అమ్ముకొని నాలుగు ముద్దలు తినాలనుకుంటే.. ఆ నోటికాడి బుక్కను కూడా కార్పొరేట్‌ కంపెనీలు గుంజుకునేలా వ్యవసాయచట్టాలను తెచ్చింది. దీనిపై ఇప్పటికే దేశమంతటా కోట్ల మంది రైతులు రోడ్లమీదకు వచ్చి మోదీ సర్కారుపై భగ్గుమంటున్నారు…

- Advertisement -

Latest news

Related news

జమ్మూకశ్మీర్‌ ను ముంచెత్తుతున్న మంచు

జమ్మూకశ్మీర్‌ ను ముంచు ముంచెత్తుతుంది. 8 జిల్లాల్లో భారీ హిమపాతం కురుస్తుండటంతో జమ్మూకశ్మీర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్టుమెంట్ జనం బయటికి రావొద్దంటూ హెచ్చరించింది. ఇటు లడఖ్, కుప్వారా, బండిపొరా ప్రాంతాల్లో...

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...