27.3 C
Hyderabad
Tuesday, November 24, 2020

వోకల్ ఫర్ లోకల్ మాటను నిలబెట్టుకుందాం: ప్రధాని మోడీ

దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోట వద్ద భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని నరేంద్రమోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు రాజ్‌ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులు అర్పించారు. కరోనా నేపథ్యంలో ఎర్ర కోట వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పతాక ఆవిష్కరణ అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు మోడీ

ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశం ముందడుగు వేయడానికి సిద్ధమైందన్నారు మోడీ.  భారత్‌  ను ఆకలిరాజ్యం నుంచి అన్నపూర్ణగా మార్చి రైతులు ఆత్మ నిర్భర భారత్‌ కు సరికొత్త అర్ధం చెప్పారన్న ప్రధాని..అన్నదాతలే స్ఫూర్తిగా అన్ని రంగాల్లో  ప్రగతి సాదిద్ధామన్నారు. వోకల్‌ ఫర్‌ లోకల్‌ మాటను నిలబెట్టుకుంటామన్న మోడీ.. భారత్ తయారు చేసిన వస్తువులను ప్రపంచం ఆదరించేలా ఉత్పత్తి చేద్దామని పిలుపునిచ్చారు. ఎఫ్‌డీఐల విషయంలో భారత్‌ కొత్త పుంతలు తొక్కుతోందన్న మోడీ.. వ్యవసాయం, బ్యాంకింగ్ వరకు అన్ని రంగాల్లో సంస్కరణలు చేపట్టినట్టు తెలిపారు

ఇవాల్టి నుంచి నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన మోడీ.. దేశంలో ప్రతి పౌరుడికి హెల్త్ ఐడీ ఇచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నామని.. మూడు వ్యాక్సిన్లు తుది పరీక్షల దశలో ఉన్నట్టు తెలిపారు. దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్న మోడీ.. పెరుగుతున్న అవసరాలతో పాటు సైబర్‌ రంగంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. సైబర్‌ నేరాల కట్టడికి నూతన ఆవిష్కరణల అవసరం ఉందన్నారు. 

స్వయం సమృద్ధ భారత్‌ సాధించాలంటే విద్యా విధానం ప్రధానమైందన్న మోడీ.. ఈ విధానంతో యువతను  ప్రపంచ పౌరులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి కోసం నూతన పథకాలు ప్రారంభించామని.. యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధికి కొత్త పథకాలు తెచ్చామన్నారు.అంతేకాదు వ్యవసాయ మార్కెటింగ్‌ రంగంలో నూతన శకానికి నాంది పలికామన్నారు మోడీ

అత్యంత కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 4 వేల మంది అథితులు హాజరయ్యారు. కొవిడ్‌-19 మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని వేడుకలను నిర్వహించారు. అతిథుల కోసం వేదిక వద్ద మాస్కులు అందుబాటులో ఉంచారు. కుర్చీల మధ్య రెండు గజాల దూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. వేడుకలకు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌  చేశారు. వేదిక సమీపంలో మెడికల్‌ బూత్‌లను, అంబులెన్సులను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...