వ్యవసాయ రంగానికి, రైతులకు వ్యతిరేకంగా ఉన్న మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ విషయమై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసినట్టు ఆయన తెలిపారు. ప్రతిపక్ష పార్టీల బృందం ఈరోజు రాష్ట్రపతిని కలిసి వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించింది.
వ్యవసాయ బిల్లులపై సరైన చర్చలు, సంప్రదింపులు జరుగకుండానే అప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంట్లో ఆమోదించారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. అందుకే ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్రపతిని కోరినట్లు చెప్పారు.