19.8 C
Hyderabad
Friday, December 4, 2020

శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో కొనసాగిన దర్యాప్తు

శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదంపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతొంది. ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ సీఐడీ దర్యాప్తునకు ఆదేశించడంతో అడిషనల్ డీజీ గోవింద్ సింగ్ నేతృత్వంలోని బృందం విచారణ కొనసాగించింది. ఒక అడిషనల్ ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు ఇన్ స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలతో పాటు క్లూస్ టీం సభ్యులు పీఎటీ టన్నెల్ వద్దకు చేరుకని అధికారులతో సమీక్షించారు.  విద్యుత్ ఫ్లాంట్ లోకి వెళ్లిన బృందం సభ్యులు బ్యాటరీ రూం, పీఎల్సీ రూం, ఎంసీఆర్, అన్ని జనరేషన్ యూనిట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నాలుగవ, ఆరవయూనిట్ల వద్ద పేలుడు కారణంగా ఎక్కువగా ధ్వంసమైన తీరును బృందం సభ్యులు తెలుసుకున్నారు. సర్వీస్ బే నుంచి కిందకు వెళ్లేందుకు క్లూస్ టీం బృందం ప్రయత్నించగా..మూడో అంతస్తు వరకు నీరు చేరుకోవడంతో ఫలితం లేకపోయింది. దీంతో ఘటనాస్థలంలో మాత్రమే ఆధారాలు సేకరించినట్టు తెలుస్తున్నది. ఘటనాస్థలంలో వస్తువులను సేకరించి వాటన్నింటినీ ఫోరెన్సిక్ ల్యాబ్ కు  పంపనున్నట్టు దర్యాప్తు బృందంలోని ఉన్నతాధికారి  తెలిపారు.                       

ప్లాంట్ ప్రారంభమైన 2001 నుంచి ఇప్పటిదాకా మిషనరీలో ఏవైనా లోపాలు తలెత్తాయా? అనే అంశాలను విశ్లేషించడంలో విద్యుత్ కేంద్రం అధికారులు దర్యాప్తు బృందానికి సహకారం అందిస్తున్నారు. ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది స్టేట్ మెంట్లను అధికారులు రికార్డు చేస్తున్నట్టు తెలిసింది. సైబర్ క్రైం బృందం సైతం ప్లాంట్ లో కంపూటర్లు, హార్డ్ డిస్క్ లు, ఇతర ఎలక్ర్టానిక్ వస్తువులను సేకరించినట్టు తెలిసింది. ప్రమాదంపై శాస్త్రీయంగా దర్యాప్తు చేయాల్సి ఉన్నదని, పూర్తి ఆధారాల విశ్లేషణ తర్వాతే ఓ అంచనాకు రాగలుతామని ఉన్నతాధికారి తెలిపారు. ఆధారాల సేకరణకు మరో రెండ్రోజులు పడుతుందని తెలుస్తొంది.  

అటు శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌ లో 15 రోజుల్లోనే ఉత్పత్తిని మొదలు పెడతామని ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. ప్రమాదం వల్ల విద్యుత్‌ గ్రిడ్‌కు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ఇక  తొమ్మిది మంది మరణించిన ఘటన ఎంతో దురదృష్టకరమన్న ప్రభాకర్‌రావు.. విచారణపై సంస్థాపరంగా కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. TSSPDCL సీఎండీ రఘుమారెడ్డి అధ్యక్షతన నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ప్రమాదానికి గల కారణాలతో పాటు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా కమిటీ నివేదిక ఇస్తుందని ప్రభాకర్‌ రావు చెప్పారు.

పవర్ హౌస్ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను త్వరలోనే స్వయంగా కలుస్తామని జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు చెప్పారు. సంస్థ తరఫున ఎక్స్‌ గ్రేషియా చెల్లించనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Latest news

Related news

ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వివరాలతో కూడిన డేటా బేస్...

కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను గురువారం కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలకు పిలిచింది. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌...

త్వరలో వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వరంగల్‌ లో కూడా బ్యాటరీ బస్సులు నడిపించాలనుకున్నా సమ్మె, కరోనా కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ మేరకు...

ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

17 సంవత్సరాల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇప్పారు. ఆ వార్తల్లో నిజం లేదని సదరు...