జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులకు చెక్ పెడుతున్నాయి భద్రతా బలగాలు. తీవ్రవాదులున్నారనే స్థానికుల సమాచారంతో షోపియాన్ జిల్లా సుగాన్ లో కూంబింగ్ నిర్వహించారు సైనికులు. లొంగిపోవాలని కోరినా వినకపోవడంతో జవాన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. సంఘటన స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.