సిరియాలో గ్యాస్ పైపులైన్ లో భారీ పేలుడు సంభవించింది. డమాస్కస్ నగరంలో అరబ్ గ్యాస్ పేలుడుతో దేశవ్యాప్తంగా అందకారం నెలకొంది. ఈ దాడికి వెనక ఉగ్రవాదుల హస్తం ఉందని అనుమానాలు వ్యక్తం చేసింది విద్యుత్ మంత్రిత్వశాఖ. అద్రా, అల్ ధమీర్ ప్రాంతాల మిలిటెంట్లు జరిపిన ఈ దాడితో తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. పైపులైన్ పేలుడు వల్ల సిరియా దేశంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగింది. సిరియా దేశవ్యాప్తంగా అంధకారం అలముకుంది.