22.7 C
Hyderabad
Sunday, November 29, 2020

సీఎం చేతుల మీదుగా రేపే ధరణి పోర్టల్‌ ప్రారంభం

మరో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకు సీఎం కేసీఆర్‌ ..మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి గ్రామంలో ధరణి పోర్టల్‌ ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా జరగనుంది. ఇందుకోసం దాదాపుగా అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా అన్నింటినీ పరిశీలించారు. ప్రారంభోత్సవం తర్వాత జర్నలిస్టులతో కలిసి సీఎం కేసీఆర్‌ లంచ్‌ చేస్తారు. ఆ తర్వాత బహిరంగసభలో పాల్గొని ప్రజలకు  పోర్టల్‌కు సంబంధించిన సందేశాన్ని ఇస్తారు.

అటు ధరణి పోర్టల్‌ నిర్వహణపై తాసిల్దార్లు, నాయబ్‌ తాసిల్దార్లు, ధరణి ఆపరేటర్లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్లకు సీఎస్‌ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ధరణి నిర్వహణను వివరించారు. స్లాట్‌బుకింగ్‌, సిటిజన్‌ పోర్టల్‌, సేల్‌, సక్సేషన్‌, పార్టిషన్‌ అంశాలపై మాట్లాడారు. ధరణి పోర్టల్‌లో స్లాట్‌ బుక్‌ అయ్యాక నిర్దేశిత సమయానికి తాసిల్దార్‌ కార్యాలయానికి వెళ్తే పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందని సీఎస్‌ తెలిపారు. ధరణి దేశంలోనే ట్రెండ్‌సెట్టర్‌గా నిలుస్తుందని చెప్పారు. ధరణి ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా, పారదర్శకంగా, వేగంగా సేవలు అందించాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. రిజిస్ట్రేషన్లలో మోసాలు జరుగకుండా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌చేస్తే భూ యజమాని ఫొటోతో సహా అన్ని వివరాలు ధరణిలో ప్రత్యక్షం అవుతాయని వెల్లడించారు. స్లాట్‌ బుకింగ్‌లో ఇచ్చిన సమయానికి తాసిల్దార్‌ లేకపోయినా రిజిస్ట్రేషన్లు ఆగవని, వారి స్థానంలో నాయబ్‌ తాసిల్దార్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తారని చెప్పారు. రిజిస్ట్రేషన్‌ సేవలతో రెవెన్యూ అధికారుల బాధ్యత మరింత పెరిగిందని సీఎస్‌ అన్నారు. హోదా కూడా పెరిగిందని.. తాసిల్దార్లు, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లు కూడా అయ్యారని వివరించారు.

ధరణిలో ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో సాంకేతిక బృందం అందుబాటులో ఉండనుంది. ఏ సమస్య వచ్చినా వెంటనే  ఈ టీమ్‌ పరిష్కరించనుంది. రాష్ట్రస్థాయిలో కంట్రోల్‌ రూమ్‌తో పాటు, జిల్లాస్థాయి టెక్నికల్‌ సపోర్ట్‌ టీమ్‌లు పనిచేస్తాయి. నెట్‌వర్క్‌ సమస్యలు రాకుండా ఉండేందుకు ఏడు సర్వర్లు పని చేయనున్నాయి. అటు పోర్టల్‌ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రతి మండలానికి 10 లక్షల చొప్పున 57 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.