27 C
Hyderabad
Friday, December 4, 2020

స్ట్రెచ‌ర్‌ పై వచ్చి ఓటేసిన ఎమ్మెల్యే కేస‌రినాథ్ జెసంగ్‌భాయ్

గుజరాత్ లో నాలుగు రాజ్యసభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది.  ఎమ్మెల్యేలంతా ఆయా అసెంబ్లీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు హ‌క్కు వినియోగించుకుంటున్నారు. అయితే, గుజ‌రాత్ బీజేపీ ఎమ్మెల్యే కేస‌రినాథ్ జెసంగ్‌భాయ్ సోలంకి అనారోగ్యం కార‌ణంగా ఇటీవ‌ల ఆస్ప‌త్రిలో చేరారు. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆస్ప‌త్రిలో ఉన్నా ఆయ‌న ఓటువేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో బీజేపీ నేత‌లు ఈ ఉద‌యం ఆయ‌న‌ను అంబులెన్స్‌ లో అసెంబ్లీకి తీసుకొచ్చి స్ట్రెచ‌ర్‌ పై పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. కాగా, ఓటు వేసిన అనంత‌రం ఎమ్మెల్యే సోలంకి నేరుగా ఆస్ప‌త్రికి తిరిగి వెళ్లారు. సోలంకి ప్ర‌స్తుతం మ‌తార్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచారు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....