28.4 C
Hyderabad
Thursday, October 1, 2020

‘స్పుత్నిక్ వీ’ పై శాస్త్రవేత్తల ప్రశ్నలు…

కరోనా టీకా కోసం ప్రపంచమంతా వేయి కండ్లతో ఎదురు చూస్తున్న వేళ రష్యా టీకా ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆశను రేకెత్తించింది. కరోనా త్వరలోనే అంతం అవుతుందన్న ధైర్యాన్ని కల్పించింది. ఐతే రష్యా తయారు చేసిన కరోనా టీకా ‘స్పుత్నిక్‌ వీ’ పై భారత్‌ సహా అనేక దేశాల శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్లినికల్‌ ట్రయల్స్‌ సమాచారాన్ని బహిర్గతం చేయక పోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు నెలల కంటే తక్కువ సమయంలోనే ట్రయల్స్‌ నిర్వహించి టీకాకు అనుమతినివ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

‘రష్యా టీకా ఎంత మేరకు సురక్షితం, కరోనాపై ఎంత ప్రభావం చూపుతుందన్నది ఇంకా అంచనాకు రావాల్సి ఉన్నదని ఎయిమ్స్ తెలిపింది. టీకా రోగ నిరోధక శక్తిని పెంచాలి. అదే సమయంలో ఎలాంటి దుష్ప్రభావాలు ఉందకూడదని ఎయిమ్స్ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అభిప్రాయపడ్డారు. టీకాపై ఎన్ని దశల క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించారు? ఎంత మందిపై పరీక్షలు చేశారు? ఫలితాలేంటి? అన్న విషయాలు తెలియకుండా టీకాను విశ్వసించలేమని చెప్పారు. అటు ముందు తామే టీకా తెచ్చామన్న పేరు కోసం రష్యా తన ప్రజలపైనే ప్రయోగాలు నిర్వహిస్తున్నదని బ్రిటన్‌, అమెరికా, లండన్‌, జర్మనీ, ఇజ్రాయెల్ తదితర దేశాల శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు తాము అభివృద్ధి చేసిన టీకా మొదటి బ్యాచ్‌ మరో రెండు వారాల్లో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్‌ మురాస్కో చెప్పారు. టీకా భద్రతపై వస్తున్న విమర్శలు నిరాధారమైనవని కొట్టి పారేశారు. క్లినికల్‌ ట్రయల్స్‌ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన గమాలయా ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ గింట్స్‌ బర్గ్‌ తెలిపారు. కాగా, రష్యా టీకాకు అనుమతిపై ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులతో చర్చిస్తున్నామని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. వ్యాక్సిన్‌ సమర్థతను పూర్తిగా అంచనా వేయాల్సి ఉందని సంస్థ అధికార ప్రతినిధి చెప్పారు.

- Advertisement -

Latest news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

Related news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

లైంగిక వేధింపుల కేసులో పోలీసుల ముందుకు అనురాగ్‌ కశ్యప్‌

లైంగిక వేధింపుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ఫిల్మ్ డైర‌క్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ ..  ముంబైలోని వెర్సోవా పోలీసుల ముందు హాజరయ్యారు. న‌టి పాయల్ ఘోష్  ఆరోపణలతో పలు విషయాలపై...

రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 75వ వసంతం లోకి అడుగుపెట్టిన సందర్భంగా సీఏం కేసీఆర్ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు....

దేశంలో 24 గంటల్లో 86,821 కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరువైంది. నిన్నటికి నిన్న 1వెయ్యి 181 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 98వేల678...