హత్రాస్ గ్యాంగ్ రేప్ ఉదంతంపై మరోసారి కేంద్రాన్ని టార్గెట్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. ఈ ఘటనపై దేశం మొత్తం స్పందించినప్పటికీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటిదాకా ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు. సామూహిక అత్యాచార మృతురాలి కుటుంబాన్ని యూపీ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందని.. వారిపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందని విమర్శించారు. హత్రాస్, బులంద్ షెహర్, ఆజంగడ్ అత్యాచారాల నుంచి యోగీ సర్కార్ గుణపాఠం నేర్చుకోవాలన్నారు రాహుల్ గాంధీ. ఇక కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు.