హథ్రాస్ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాధిత కుటుంబాన్ని కలుసుకోకుండా అడ్డుకుంటున్న యోగి సర్కార్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విపక్షాల ఆందోళనలకు తలొగ్గిన ప్రభుత్వం..ఈ కేసులో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తో సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. సిట్ ప్రాధమిక దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది. అయితే సిట్ దర్యాప్తు ముగిసేవరకు మృతురాలి కుటుంబాన్ని కలిసేందుకు ఎవరిని అనమతించేది లేదంటున్న అధికారులు.. బుల్గార్గీ గ్రామాన్ని ముట్టడించారు. ఊరి చుట్టూ బారికేడ్లు పెట్టారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు. సామూహిక అత్యాచారం, హత్యకు గురైన దళిత బాలిక కుటుంబ సభ్యులు నివశించే ఆ గ్రామంలోకి ఎవరూ వెళ్లకుండా లోపల నుంచి బాధిత కుటుంబం సహా ఎవరూ బయటకు రాకుండా పోలీసులు పహరా కాస్తున్నారు.