మణిపూర్ లో వరుస భూంపాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. నిన్నటి భూప్రకంపనల నుంచి కొలుకోకముందే తెల్లవారుజామున మరోసారి భూకంపం సంభవించింది. కమ్ జోంగ్ కి పది కిలోమీటర్ల దూరంలో వచ్చిన భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.4గా నమోదైంది. అయితే ఈ ఘటటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని మణిపూర్ చెప్పారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లోనూ భూకంపం సంభవించింది. లాహాల్, స్పిటిలో తెల్లవారుజామున భూప్రకంపనలు రావడంతో జనం భయంతో బయటికి పరుగులు తీశారు.ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.3గా నమోదు అయినట్టుగా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.