27.3 C
Hyderabad
Tuesday, November 24, 2020

హైదారాబాద్‌ లో ఈనెల 7 నుంచి మెట్రో సర్వీసులు

అన్‌ లాక్ ఫోర్ మార్గదర్శకాలను అనుసరించి హైదరాబాద్‌లో మెట్రో రైళ్ల ప్రారంభానికి హెచ్‌ఎంఆర్‌ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబరు 7నుంచి మెట్రో రైళ్లు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో రైళ్లలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై మెట్రో అధికారులు విధివిధానాలు ఖరారు చేసారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి 10 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు మెట్రో రైలులోకి ప్రవేశాన్ని కల్పించడాన్ని తాత్కాలికంగా నిషేధించనున్నారు. అన్ని మెట్రో స్టేషన్లలో లిఫ్టులను పూర్తిగా ఆపేయనున్నారు. అంతేకాక, టికెట్లను కూడా కౌంటర్ల నుంచి నేరుగా కొనుక్కోవడానికి స్వస్తి పలకనున్నారు. ప్రయాణానికి స్మార్ట్ కార్డులు లేదా డిజిటల్ టికెట్లకు మాత్రమే అనుమతి ఉందని హెచ్ఎంఆర్ సంస్థ వెల్లడించింది. అటు గత 6 నెలలుగా సర్వీసులు నిలిపివేయడంతో 3 కారిడార్లు, 57 మెట్రో స్టేషన్లలో క్లీనింగ్‌, శానిటేషన్‌ పనులు చేపట్టారు.

ఇక కేంద్రం ప్రకటించిన తాజా గైడ్ లైన్స్ కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు హెచ్ ఎం ఆర్ కూడా విధివిధానాలు ఖరారు చేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి గ్రేడ్ పద్ధతిలో దశల వారీగా మెట్రో కార్యకలాపాలు తిరిగి ప్రారంభిస్తారు. రైళ్ల ఫ్రీక్వెన్సీ సుమారు 5 నిమిషాలు ఉంటుంది. సామాజిక దూరాన్ని నిర్ధారించడానికి, ప్రయాణీకులు నిలబడటానికి స్టేషన్ లలో, రైళ్ళ లోపల తగిన గుర్తులు ఏర్పాటు చేస్తున్నారు. రైళ్లలోసామాజిక దూరాన్ని సిసిటివి ద్వారా ఓసిసి, స్టేషన్ కంట్రోలర్ మరియు రైలు ఆపరేటర్లు పర్యవేక్షిస్తారు. ప్రయాణీకులు, సిబ్బంది అందరికీ ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు. మాస్క్ లేకుండా వస్తే.. స్టేషన్ లోనే కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మాస్క్ నిబంధన ఉల్లంఘిస్తే భారీ జరిమానా విధిస్తారు. థర్మల్ స్క్రీనింగ్ తరువాత మాత్రమే స్టేషన్లలోకి అనుమతించ బడతారు. ఉద్యోగులు,  సిబ్బందికి సరైన పిపిఇ కిట్లు, శానిటైజర్లు అందిస్తారు. నగదు రహిత ఆన్‌లైన్ లావాదేవీలతో కూడిన స్మార్ట్ కార్డ్, మొబైల్ క్యూఆర్ టికెట్ ద్వారా మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

సెప్టెంబర్ 7 నుంచి మియా పూర్- ఎల్బి నగర్ మార్గంలో మొదటి దశలో ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4  గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రైళ్లు నడుస్తాయి. రెండో దశలో సెప్టెంబర్ 8 నుంచి నాగోల్- రాయదుర్గం మార్గంలో, సెప్టెంబర్ 9 నుంచి అన్ని రూట్లల్లో నిర్ణీత సమయాల్లో సర్వీసులు నడుస్తాయి. అటు కంటైన్మెంట్ జోన్లలో ఉన్న గాంధీ హాస్పిటల్, భరత్ నగర్, మూసాపేట, ముషీరాబాద్, యూసుఫ్ గూడా స్టేషన్లను మూసివేస్తారు.

కరోనా ధాటికి మార్చి 22 నుంచి మెట్రో సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. దేశంలోని రెండో అతి పొడవైన మెట్రో వ్యవస్థ కలిగిన హెచ్ఎంఆర్ సంస్థ రోజుకు 55 రైళ్లతో రాకపోకలు సాగిస్తోంది. నాలుగున్నర లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతోంది. కరోనాతో గత ఆరు నెలలుగా రైళ్లు డిపోలకే పరిమితం కావడంతో సంస్థకు కోట్ల కొద్దీ నష్టం వాటిల్లింది.

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...