మహారాష్ట్రలోని భండారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూ విభాగంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది నవజాత శిశువులు కన్నుమూశారు. అర్ధరాత్రి సమయంలో ఐసీయూలో మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఐసీయూలో 17 మంది చిన్నారులు ఉన్నారు.
మాటలకు అందని విషాదం.. అమిత్ షా
ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. మాటలకు అందని విషాదం అని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రభుత్వం ఆదుకోవాలి.. రాహుల్ గాంధీ
ఈ ఘటన విషాదకరమైందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అభివర్ణించారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.