23.6 C
Hyderabad
Saturday, November 28, 2020

భారత్‌ లో 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు

దేశంలో కరోనా రోజు రోజుకీ విజృంభిస్తోంది. కొత్త కేసుల నమోదులో రోజుకో రికార్డు సృష్టిస్తోంది.గడిచిన 24 గంటల్లో 14వేల 516 కేసులు నమోదు కాగా… 375 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3లక్షల95వేల 48కు, మృతుల సంఖ్య 12,వేల948కి చేరుకుందని వెల్లడించింది. ఇప్పటివరకు 2లక్షల 13వేలమంది రోగులు కరోనా నుంచి కోలుకుంటే .. లక్షా 68వేల269 మంది చికిత్స పొందుతున్నారు.  ఇటు కరోనా సోకిన ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. యడ్యూరప్ప సిబ్బందిలో ఒకరికి కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసుల నమోదులో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాతి స్థానాన్ని భారత్‌ ఆక్రమించడం కలకలం రేపుతోంది.

- Advertisement -

Latest news

Related news

మంత్రి ఎర్రబెల్లి.. ఇంటింటి ప్రచారం

హైదరాబాద్‌ నగరంలో కేవలం టీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యమయిందని.. పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మీర్‌పేట హౌసింగ్‌బోర్డు కాలనీ డివిజన్‌లో ఆయన ఇంటింటికీ...

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...