21.4 C
Hyderabad
Friday, October 23, 2020

24 గంటల్లో 26,506 కరోనా కేసులు

భారత్‌ లో కరోనా మహమ్మారి ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 26వేల 506 కొత్త కేసులు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న ఒక్కరోజే 475 మంది కరోనాతో పోరాడుతూ మృత్యుఒడికి చేరినట్టువెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కేసులు 7లక్షల 93వేల 802దాటగా.. మరణాలు 21వేల604కి చేరాయని తెలిపింది. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులు 2లక్షల76వేల 685 కాగా, 4లక్షల 95వేల 513 మంది బాధితులు చికత్సతో పూర్తిగా కోలుకున్నారు. అయితే దేశంలో 90 శాతం  కరోనా యాక్టివ్‌ కేసులు కేవలం 8 రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది.

- Advertisement -

Latest news

Related news

రాజస్థాన్‌పై హైదరాబాద్‌ విజయం

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌ రౌండ్‌ పర్‌ఫామెన్స్‌ తో అదరగొట్టింది. ఫ్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక...

రాజ‌శేఖ‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాలి…చిరు ట్వీట్

క‌రోనాతో ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న రాజ‌శేఖ‌ర్‌కు సంబంధించి తాజాగా హెల్త్ బులిటెన్ విడుద‌లైంది.  రాజ‌శేఖ‌ర్  ఆరోగ్యం నిల‌క‌డ‌గానే  ఉంద‌ని, చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని వైద్యులు తెలిపారు. అలానే త‌న తండ్రి...

సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా.. ఏడవరోజు మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సప్త ఆశ్వాలను కలిగిన సూర్యప్రభపై శ్రీనివాసుడు వజ్రకవచం ధరించి...

బీహార్‌ లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్‌

బీహార్ లో పోలింగ్‌ దగ్గర పడుతున్న వేళ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్‌ చేసింది. పాట్నాలో మేనిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ..ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందించ‌డమే...