దేశంలో కరోనా ఉద్ధృతి అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే పాజిటీవ్ కేసుల సంఖ్య 9లక్షలు దాటింది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 298వేల 498 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9లక్షల 6వేల 752కు చేరింది. కొత్తగా 553 మంది కొవిడ్ తో చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 23వేల 727కు పెరిగింది. కొవిడ్ నుంచి 5లక్షల 71వేల 460మంది కోలుకోగా ఇంకా 3లక్షల 11వేల 565 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ర్ట, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఏపీ, తెలంగాణలో కేసుల తీవ్రత పెరుగుతోంది.