18.3 C
Hyderabad
Wednesday, October 28, 2020

24 గంటల్లో 9996 కరోనా కొత్త కేసులు

భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన గంటల్లో 9 వేల 996 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే రికార్డ్. ఇక మరణాల సంఖ్య కూడా ఆందోళనకర స్థాయిలో నమోదవుతోంది. 24 గంటల్లో 357 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాలు 8వేల 102కు చేరాయి. ప్రస్తుతం యాక్టీవ్ కేసులు లక్షా 37వేల 448 ఉండగా, ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య లక్షా 41వేల 29కి చేరింది. మొత్తం కేసుల్లో మహారాష్ట్ర టాప్ ప్లేస్ లో ఉంది. అక్కడ మొత్తం కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్‌ల్లోనూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

- Advertisement -

Latest news

Related news

సీఎం చేతుల మీదుగా రేపే ధరణి పోర్టల్‌ ప్రారంభం

మరో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకు సీఎం కేసీఆర్‌ ..మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి గ్రామంలో ధరణి...

ప్రారంభమైన బీహర్ తొలి విడత పోలింగ్

బీహార్‌లో  తొలిదశ ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు జిల్లాల్లోని 71  శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.  తొలివిడుత...

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...