కరోనాతో భారత్ కకావికలం అవుతోంది. రోజురోజుకు రికార్డుస్థాయిలో కేసులు నమోదు అవుతుండడంతో పాజిటీవ్ కేసుల సంఖ్య 29లక్షలు దాటింది. గడిచిన 24గంటల్లో 68వేల898 కేసులు బయటపడగా.. మొత్తం కేసుల సంఖ్య 29లక్షల5వేల824కు చేరుకుంది. నిన్నటికి నిన్న 983 మంది మరణించగా..మొత్తం మృతుల సంఖ్య 54వేల849కి చేరింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 21లక్షల58వేల947కు చేరుకోగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 6లక్షల92వేల28 గా ఉంది. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీలు ఉన్నాయి.