కోవిడ్-19 నేపథ్యంలో 2020-21 అకాడమిక్ ఇయర్ లో క్లాస్ 9, 10, 11,12 లకు సంబంధించి 30 శాతం సిలబస్ ని తగ్గించినట్లు సీబీఎస్ఈ అకాడమిక్ డైరెక్టర్ జోసెఫ్ తెలియజేశారు. కరెంట్ అకాడమిక్ ఇయర్ కు మాత్రమే ఈ సిలబస్ తగ్గింపు వర్తిస్తుందన్నారు. సబ్జెక్టుల వారీగా సిలబస్ వివరాలను సీబీఎస్ఈ వెబ్ సైట్లో (https://www.cbse.gov.in/) పెట్టినట్లు చెప్పారు. ఇటీవల సీబీఎస్ఈ సిలబస్ ను తగ్గిస్తామని యూనియన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ చెప్పిన విషయం తెలిసిందే.