తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న3446 గ్రామీణ్ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలో 1150, ఆంధ్రప్రదేశ్లో 2296 పోస్టులు ఉన్నాయి. 18 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండి తెలుగు భాషలో ప్రావీణ్యం, కంప్యూటర్ లో బేసిక్ నాలెడ్జ్ ఉండి టెన్త్ పాసైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండానే టెన్త్ మెరిట్ స్కోరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరింత సమాచారం, దరఖాస్తు విధానం, ఫీజు తదితర వివరాల కోసం ఇండియా పోస్ట్ వెబ్ సైట్లు https://indiapost.gov.inor; https://appost.in/gdsonline చూడండి.