24.2 C
Hyderabad
Friday, January 22, 2021

కరెంటు లైన్ కి తాకిన బస్సు.. 5గురు మృతి

ఓ ప్రైవేట్ బస్సు కరెంట్ లైన్ కి తాకడంతో బస్సు ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తున్న అయిదుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువయ్యూర్‌లో కల్లనై నుంచి మన్నార్‌గుడికి వెళ్తున్న బస్సు అదపుతప్పి రోడ్డు పక్కనే ఉన్నక‌రెంటు పోల్‌ని ఢీకొట్టింది. దీంతో ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తున్న వారు క‌రెంట్ షాక్‌కి గుర‌య్యారు. చనిపోయిన వారిలో వరకూర్‌ ప్రాంతానికి చెందిన కల్యాణరామన్‌(55), గణేశన్‌(50), నాదరాజన్‌(45)లుగా గుర్తించారు. మిగ‌తావారిని గుర్తించాల్సి ఉంద‌ని పోలీసులు చెప్పారు. గాయ‌ప‌డ్డ వారిని స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించామ‌న్నారు.

- Advertisement -

Latest news

Related news

కరోనాను కంట్రోల్ చేయలేక ప్రధాని రిజైన్.. ఎక్కడంటే..

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఎంత గజగజలాడించినా అన్ని దేశాలు ఎంతోకొంత ప్రయత్నం చేస్తూ.. కొంతవరకైనా కట్టడి చేస్తున్నాయి. అయితే ఒక దేశంలో మాత్రం కరోనా వైరస్‌ను నియంత్రించలేక ఏకంగా ప్రధానమంత్రే...

ప్రభాస్ పెళ్లిపై రెబల్ స్టార్ కామెంట్

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ ఒకరు. పాన్‌ ఇండియా స్టార్‌గా అదరగొడుతున్న ప్రభాస్.. పెళ్లి గురించి ఎప్పుడూ టాపిక్ వచ్చినా అది హాట్ టాపిక్ గానే ఉంటుంది. బాహుబలి...

మహేశ్ కొత్త ఫొటోలు చూశారా?

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. సర్కారు వారి పాట షూటింగ్ కోసం జిమ్ముల్లో కసరత్తులు...

స్ట్రీట్‌కు సుశాంత్ పేరు.. ఎక్కడంటే..

దివంగత బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఓ అరుదైన గౌరవం లభించింది. సుశాంత్ పేరుని ఢిల్లీ ప్రజలు మర్చిపోకుండా ఢిల్లీ మున్సిపల్ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు.