దేశంలో కరోనా వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుతుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ చెప్పారు. దేశవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2.20 లక్షల దిగువకు తగ్గిందన్నారు. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే దాదాపు 50 వేల యాక్టివ్ చేసులున్నాయన్నారు.
16.5 లక్షల డోసుల కొవాగ్జిన్ ఉచితం
భారత్ బయోటెక్ కంపెనీ 16.5 లక్షల డోసుల కొవాగ్జిన్ వ్యాక్సిన్ను ఉచితంగా అందిస్తుందన్నారు. 38.5 లక్షల డోసులను ఒక్కో డోసుకు రూ.295 లెక్కన ఇస్తుందన్నారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్కో డోసుకు రూ.200 చొప్పున చెల్లిస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కోసం 1.10 కోట్ల డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్, 55 లక్షల డోసుల కొవాగ్జిన్ వ్యాక్సిన్లను కొనేందుకు ఒప్పందాలు చేసుకున్నామన్నారు.