టిక్‌టాక్, పబ్జీ, వీచాట్ సహా 59 టాప్ చైనా యాప్‌లపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ శాశ్వత నిషేధం విధించినట్లు సమాచారం. డేటా నిబంధనలు పాటించడం లేదని వీటిపై గతేడాది జూన్ లో కేంద్రం నిషేధం విధించింది. భారతీయుల డేటాను ఈ యాప్ లు దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపణలు రావడంతో ఆయా సంస్థల నుంచి కేంద్రం వివరణ కోరింది. తాజాగా ఆ వివరణలపై సంతృప్తి చెందని కేంద్రం వాటిపై శాశ్వతంగా నిషేధం విధించినట్లు తెలుస్తోంది. డేటా ప్రైవసీ నిబంధనలను పట్టించుకోని దాదాపు 200 చైనా యాప్ లపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే.