కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకునేందుకు జనం ఇంకా భయపడుతున్నారు. దాదాపు 62 శాతం మంది ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేందుకు విముఖత చూపుతున్నట్లు లోకల్‌సర్కిల్స్ చేపట్టిన సర్వే తేల్చింది. అయితే వ్యాక్సిన్ పై విముఖత చూపే వారి సంఖ్య గత మూడు వారాల్లో 69 శాతం నుంచి 62 శాతానికి తగ్గిందని సర్వే చెప్పింది. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ పై అవగాహన లేనందున చాలా మంది వ్యాక్సిన్ వెంటనే తీసుకోలేమని ప్రజలు అభిప్రాయపడినట్లు సర్వేలో వెల్లడించారు. వ్యాక్సిన్ సామర్థ్యంపై నమ్మకం లేదని 14 శాతం మంది, కరోనా వైరస్‌లను ప్రస్తుత వ్యాక్సిన్లు అడ్డుకోలేవని 4 శాతం మంది చెప్పారు. వ్యాక్సిన్ అవసరం లేకుండానే కరోనా పోతుందని మరో 4 శాతం మంది చెప్పడం విశేషం. దేశ వ్యాప్తంగా 230 జిల్లాలో నిర్వహించిన ఈ సర్వేలో 17 వేల మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు.