24.2 C
Hyderabad
Friday, January 22, 2021

కేరళలో బ్రిటన్ స్ట్రెయిన్ నమోదు.. 8 మందికి పాజిటివ్

దేశంలో కరోనా కొత్త వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. తాజాగా యూకే నుంచి కేరళకు వచ్చిన వారిలో 8 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వారి నమూనాలను పూణెలోని జాతీయ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించారు. వారిలో కరోనా స్ట్రెయిన్‌ లక్షణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అనుమానితులకు మరిన్ని పరీక్షలు నిర్వహించి.. తగు వైద్యం అందిస్తామని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు.

రాష్ట్రంలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నిఘా మరింత కట్టుదిట్టం చేస్తామని మంత్రి తెలిపారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నదని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మరణాల రేటు తగ్గిందని చెప్పారు.

- Advertisement -

Latest news

Related news

ప్రభాస్ పెళ్లిపై రెబల్ స్టార్ కామెంట్

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ ఒకరు. పాన్‌ ఇండియా స్టార్‌గా అదరగొడుతున్న ప్రభాస్.. పెళ్లి గురించి ఎప్పుడూ టాపిక్ వచ్చినా అది హాట్ టాపిక్ గానే ఉంటుంది. బాహుబలి...

మహేశ్ కొత్త ఫొటోలు చూశారా?

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. సర్కారు వారి పాట షూటింగ్ కోసం జిమ్ముల్లో కసరత్తులు...

స్ట్రీట్‌కు సుశాంత్ పేరు.. ఎక్కడంటే..

దివంగత బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఓ అరుదైన గౌరవం లభించింది. సుశాంత్ పేరుని ఢిల్లీ ప్రజలు మర్చిపోకుండా ఢిల్లీ మున్సిపల్ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు.

మగవాళ్లను భయపెడుతున్న కోవిడ్ కొత్త సర్వే

వ్యాక్సిన్ వచ్చి.. మెల్లగా కరోనా తగ్గిపోతుందన్న సందర్భంలో.. ఓ కొత్త న్యూస్ భయపెడుతుంది. వైరస్ సోకిన పురుషుల్లో అతికొద్ది మందికి కామన్ గా ఒక లక్షణం కనిపిస్తోంది.