29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

14 రోజుల రిమాండ్ కు అచ్చెన్న

ఏపీ టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి స్థానిక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ విధించింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థి కింజరాపు అప్పన్నను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారనే కారణంతో పోలీసుల ఆయనను అరెస్ట్ చేసి కోటబొమ్మాళి కోర్టు ముందు హాజరు పరిచారు. కేసు పుర్వాపరాలను పరిశీలించిన కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అచ్చెన్నను శ్రీకాకుళం సమీపంలోని అంపోలులో గల కేంద్ర కారాగారానికి తరలించారు.

అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడలో ఆయన భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ చేయగా.. ఏకగ్రీవంగా ఎంపిక చేయాలని తొలుత టీడీపీ నేతలు భావించారు. అచ్చెన్నాయుడికి దగ్గరి బంధువైన కింజరాపు అప్పన్న వైసీపీ మద్దతుతో నామినేషన్ దాఖలు చేయడానికి ప్రయత్నించగా.. ఆయనను అచ్చెన్నాయుడు అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. అచ్చెన్న అరెస్టుపై శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిచ్చింది. అచ్చెన్న అరెస్టు‌ను నిరసిస్తూ.. టెక్కలి, నిమ్మాడ, కోటబొమ్మాళి వంటి చోట్ల ప్రదర్శనలను నిర్వహించారు.

- Advertisement -

Latest news

Related news